ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: ఎమర్జెన్సీ సమయాల్లో సాయం కోసం కొత్త యాప్‌

ABN, First Publish Date - 2022-06-22T15:30:00+05:30

ఒమన్ పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ(CDAA).. పౌరులు, నివాసితులు అత్యవసర పరిస్థితుల సమయంలో సహాయం పొందేందుకుగాను నిడా(NIDA), కాల్(CALL) అనే కోడ్‌నేమ్‌లతో యాప్‌ను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ఒమన్ పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ(CDAA).. పౌరులు, నివాసితులు అత్యవసర పరిస్థితుల సమయంలో సహాయం పొందేందుకుగాను నిడా(NIDA), కాల్(CALL) అనే కోడ్‌నేమ్‌లతో యాప్‌ను  ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో SOS సిస్టమ్ ద్వారా బటన్‌ నొక్కడం ద్వారా ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు అంబులెన్స్‌ను కూడా పిలవొచ్చు. ఈ ఫీచర్ మూగవారు, వినికిడి లోపం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్, నదులు-చెరువులలో మునిగిపోయే సంఘటనలతో సహా ఇతర అత్యవసర పరిస్థితుల సమయాల్లో ఈ యాప్ ద్వారా ఎమర్జెన్సీ సర్వీసులను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయక చర్య పట్ల నివాసితులు, దేశ పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన సర్వీస్‌గా వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-22T15:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising