ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన నేపాల్ పీఎం.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2022-03-13T01:24:01+05:30

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా చేర్చడంలో సహకరించిన భారత ప్రభుత్వానికి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ధన్యవాదాలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా చేర్చడంలో సహకరించిన భారత ప్రభుత్వానికి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ధన్యవాదాలు తెలియజేశారు. ఆపరేషన్ గంగాలో భాగంగా నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఇండియా మీదుగా స్వదేశానికి చేరుకున్నారన్నారు. మాకు సాయపడినందుకు భారత ప్రధానికి, ప్రభుత్వానికి ధన్యావాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో.. ఓ బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 


మరోవైపు.. రష్యాలోని భారతీయ విద్యార్థులు, పౌరుల ఆందోళన తగ్గేలా అక్కడి భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రష్యా వీడాలని చెప్పేందుకు తగిన భద్రతాపరమైన కారణాలేవీ లేవని అక్కడి ఇండియన్లకు భరోసా ఇచ్చింది. అయితే.. నాటో దేశాల ఆంక్షల కారణంగా రష్యాలో బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని పేర్కొంది. ఇక రష్యా-ఇండియా విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పింది. రష్యాలోని యూనివర్శిటీలు ఇప్పటికే ఆన్‌లైన్ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్న నేపథ్యంలో.. విద్యార్థులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.



Updated Date - 2022-03-13T01:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising