ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitలో ప్రశాంతంగా ముగిసిన NEET.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన భారత అంబాసిడర్

ABN, First Publish Date - 2022-07-18T14:50:50+05:30

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) భారత్ సహా కువైత్‌లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కువైత్‌లో మొత్తం దాదాపు 300 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైత్‌లోని ఇండియ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) భారత్ సహా కువైత్‌లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కువైత్‌లో మొత్తం దాదాపు 300 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ అంబాసిడర్ స్పందించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులను ఉద్దేశిస్తూ.. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. అంతేకాకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది కూడా కువైత్‌లో ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. అక్కడి భారత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి సారిగా భారత దేశం బయట కువైత్‌లో నీట్ ఎగ్జామ్ సెంటర్‌ను భారత ప్రభుత్వం గత ఏడాది నుంచి అనుమతించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నీట్ పరీక్షకు మొత్తం 18,72,329 మంది రిజిస్టర్ చేసుకోగా.. 95శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోల్చితే.. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 2.5లక్షలు పెరిగినట్టు పెరిగింది. 


Updated Date - 2022-07-18T14:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising