ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో మూతపడ్డ కాలేజీలు.. ప్రశ్నార్థకంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తు!

ABN, First Publish Date - 2022-02-17T23:57:47+05:30

కెనడాలో సుమారు 2000 మంది భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తుపట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడాలో సుమారు 2000 మంది భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తుపట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉన్నత విద్య కోసం ఏటా వేలాది మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్తూ ఉంటారు. ఇలా ఉన్నత చదువుల కోసం వెళ్లిన 2వేల మంది విద్యార్థులను మూడు కెనడా కాలేజీలు మోసం చేశాయి. విద్యార్థుల నుంచి ముందుగానే ఫీజులను వసూలు చేసిన కాలేజీల యాజమాన్యాలు.. ఆ తర్వాత దివాలా పేరుతో కాలేజీలను మూసేశాయి. కోర్సులు పూర్తి కాకముందే కాలేజీలు మూతపడటంతో భారతీయ విద్యార్థులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న రోడ్లపై నిరనలు తెలిపారు. కెనడా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర కాలేజీల్లో తమ కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 




Updated Date - 2022-02-17T23:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising