ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Texas ఘటన తర్వాత.. New York వాసులను భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్.. ఈ ఏడాదిలోనే విద్యార్థుల వద్ద..

ABN, First Publish Date - 2022-06-17T03:21:04+05:30

న్యూయార్క్ సిటీ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల నుంచి ఈ ఏడాది స్కూల్ భద్రతా అధికారులు ఏకంగా 6 వేల తుపాకులు జప్తు చేసినట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: న్యూయార్క్ సిటీ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల నుంచి ఈ ఏడాది స్కూల్ భద్రతా అధికారులు ఏకంగా 6 వేల తుపాకులు జప్తు చేసినట్టు తెలిసింది. టెక్సాస్ ఘటన కలకలం నుంచి పూర్తిగా కోలుకోకుముందే వెలుగులోకి వచ్చిన ఈ అంశం అక్కడి తల్లిదండ్రులను కలవర పెడుతోంది. ‘‘స్కూల్‌కు ఓ విద్యార్థి తుపాకీ పట్టుకుని వస్తే.. మరుసటి రోజు మరికొందరు విద్యార్థులు గన్స్‌తో ప్రత్యక్షమవుతారు’’ అని ఓ స్కూల్ భద్రతాధికారి వ్యాఖ్యానించారు. విద్యార్థుల వద్ద తుపాకులే కాకుండా స్టన్ గన్స్, కత్తులు, ఇనుప పైపులు వంటికి కూడా లభ్యమవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నానాటికీ విస్తృతమవుతున్న ఈ ట్రెండ్ ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. 


మరోవైపు.. పిల్లలు స్కూళ్లకు ఏయే వస్తువులు తీసుకుని వెళుతున్నారో ఓ కన్నేసి ఉంచాలని అధికారులు తల్లిదండ్రులను కోరుతున్నారు. తల్లిదండ్రులే ఈ సమాజానికి తొలి రక్షణ కవచాలు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక మంది అమాయకులు తుపాకీ సంస్కృతికి బలైపోతున్న ప్రస్తుత తరుణంలో అనేక మంది అమెరికన్లు ఈ దుష్ట సంప్రదాయానికి బ్రేకులు వేయాలంటూ ఉద్యమిస్తున్నారు. 

Updated Date - 2022-06-17T03:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising