ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Singapore లో జైలు పాలయిన భారతీయుడు.. బూతులు తిడుతూ పారిశుధ్య కార్మికుడిపై దాడి చేసినందుకు..

ABN, First Publish Date - 2022-05-20T01:44:48+05:30

సింగపూర్‌లోని ఓ భారతీయుడికి అక్కడి న్యాయస్థానం ఇటీవల 21 నెలల నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సింగపూర్‌లోని ఓ భారతీయుడికి అక్కడి న్యాయస్థానం ఇటీవల 21 నెలల నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిని అడ్డుకోవడం, గాయపరిచే ఉద్దేశ్యంతో దాడిచేయడం, జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం వంటి పలు అభియోగాల కింద కోర్టు ఈ మేరకు సంజీవన్ మహా లింగమ్‌ అనే వ్యక్తికి ఈ జైలు శిక్ష విధించింది. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్ 24న తన పుట్టినరోజు నాడు సంజీవన్ ఓ పారిశుధ్య కార్మికుడిపై దాడి చేశాడు. రాత్రి వేళ తన పని పూర్తి చేసుకుని ఓ విశాంత్రి కేంద్రంలో ఆ కార్మికుడు నిద్రపోతుండగా ఈ ఘటన  జరిగింది. బాధితుడిని నిద్రలేపిన సంజీవన్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత.. అతడి చెంపపై ముష్టిఘాతాలను కురిపించాడు. మరుసటి రోజు బాధితుడు ఆస్పత్రికి వెళ్లగా.. అతడి దవడ ఎముక విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు చేశారు. అయితే.. పుట్టినరోజు కేక్  ఇచ్చేందుకే పారిశుధ్యకార్మికుడిని నిద్రలేపానని  మహాలింగమ్ తన వాదన వినిపించాడు. కానీ..ఇంతకు మించిన వివరాలేవీ వెల్లడించలేదు. 


కాగా..  సంజీవన్ గతంలో చేసిన నేరాలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణం సందర్భంగా కోర్టు దృష్టి తీసుకెళ్లారు. చట్టాలను ఉల్లంఘించడం సంజీవన్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న తాగి రోడ్డుపై నానాయగీ చేస్తున్న అతడిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై సంజీవన్ ప్లాస్టిక్ స్టూల్ విసిరినట్టు తెలిపారు. అంతేకాకుండా.. పోలీస్ స్టేషన్‌లో ఉండగా ఓ మహిళా పోలీసు అధికారిపై చెప్పు విసిరినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో అతడు ఓ మహిళపై వేధింపులకు పాల్పడినట్టు కూడా ఫిర్యాదు వచ్చినట్టు ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారించేందుకు ఘటనస్థాలానికి వెళ్లిన పోలీసులకు అతడి వద్ద ఓ గాజు కర్ర కనిపించిందని, దీంతో.. వారు సంజీవన్‌ను అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు. ఇక పోలీస్ స్టేషన్‌లో ఉండగా.. సంజీవన్ వద్దంటున్నా వినకుండా తన మాస్క్ తొలగించాడని, ఓ పోలీసుపై ఉమ్మేశాడని తెలిపారు. జాత్యాహంకార పూర్తిత వ్యాఖ్యలు కూడా చేశాడని ఆరోపించారు. సంజీవన్‌కు న్యూసెన్స్ సృష్టించడం కొత్తేమీ కాదని వాదించారు. కాగా.. సంజీవన్ కూడా తన నేరాలని ఒప్పుకోవడంతో న్యాయాస్థానం వివిధ సెక్షన్ల కింద 21 నెలల నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. 



Updated Date - 2022-05-20T01:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising