ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NATS: అన్నార్తులకు అండగా 'నాట్స్' ఫుడ్ డ్రైవ్

ABN, First Publish Date - 2022-07-23T15:15:54+05:30

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS).. అమెరికాలో నిరుపేదలకు కూడా సాయం చేసేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ బోస్టన్ విభాగం విరాళం

బోస్టన్, జులై 22: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS).. అమెరికాలో నిరుపేదలకు కూడా సాయం చేసేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది. నాట్స్ బోస్టన్ విభాగం తాజాగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ (Food drive) చేపట్టింది. నాట్స్ బోస్టన్ విభాగం సభ్యులు, తెలుగువారు ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఫుడ్ డ్రైవ్ ద్వారా దాదాపు 6 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని నాట్స్ సేకరించింది. ఇలా వచ్చిన ఆహారాన్ని నిరుపేదల ఆకలితీర్చే వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్‌కి విరాళంగా అందించింది. ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో నాట్స్ బోస్టన్ విభాగ సభ్యులు శ్రీనివాస్ గొండి, శ్రీథర్ గోరంట్ల, కల్యాణ్ కాకి, శేషి రెడ్డి, పవన్ వేమూరి, సునీల్ కొల్లి, గౌతమ్ చుండూరు తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ నాయకులు తదితరులకు బోస్టన్ విభాగం నిర్వహించిన ఈ డ్రైవ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరిన్ని నూతన సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని నాట్స్ సభ్యులు తెలిపారు.



Updated Date - 2022-07-23T15:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising