ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America లో ఘోరం.. తెలుగు యువకుడిని కాల్చి చంపిన దుండగులు..!

ABN, First Publish Date - 2022-06-22T16:31:49+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. మేరీల్యాండ్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు తెలుగు యువకుడ్ని కాల్చి చంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. మేరీల్యాండ్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు తెలుగు యువకుడ్ని కాల్చి చంపారు. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్ సిటీలో ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని నల్గొండ వాసి నక్క సాయి చరణ్(26)గా గుర్తించారు. మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు ఓ వాహనంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. స్నేహితుడిని విమానాశ్రయం (Airport)లో డ్రాప్ చేసి వస్తున్న సమయంలో సాయికిరణ్‌పై నల్లజాతీయులు కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హ్యుందాయ్ టక్సన్ కారులో ప్రయాణిస్తున్న సాయి చరణ్ తలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. 


గాయాలతో ఉన్న అతడిని వెంటనే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సాయి చరణ్ ప్రాణాలొదినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నేరుగా తలపై కాల్చడంతోనే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నల్గొండకు చెందిన సాయి చరణ్ రెండేళ్లుగా బాల్టిమోర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక అతడు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు అమెరికా ధికారులు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సాయిచరణ్ మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాల్సిందిగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించారు. 


Updated Date - 2022-06-22T16:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising