ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi లో గంటకు ఏడు విడాకులు.. భర్తలకు గుడ్ బై చెబుతున్న భార్యలు.. అన్నీ అరబ్ దేశాల్లోనూ అదే సీన్..!

ABN, First Publish Date - 2022-09-21T14:13:08+05:30

అరబ్ దేశాల్లో (Arab countries) ప్రస్తుతం భర్తల నుంచి విడిపోతున్న భార్యల సంఖ్య భారీ పెరుగుతున్నట్లు తాజాగా వెలువడిన 'ది ఎకనామిస్ట్ మ్యాగజైన్' (The Economist magazine) నివేదిక పేర్కొంది. ఇన్నాళ్లు ప్రత్యేక సంప్రదాయాలు, నిబంధనల మధ్య నలిగిపోయిన అరబ్ మహిళలకు విడాకులకు (Divorce) అవకాశం లభించడం భారీ ఉపశమనం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: అరబ్ దేశాల్లో (Arab countries) ప్రస్తుతం భర్తల నుంచి విడిపోతున్న భార్యల సంఖ్య భారీ పెరుగుతున్నట్లు తాజాగా వెలువడిన 'ది ఎకనామిస్ట్ మ్యాగజైన్' (The Economist magazine) నివేదిక పేర్కొంది. ఇన్నాళ్లు ప్రత్యేక సంప్రదాయాలు, నిబంధనల మధ్య నలిగిపోయిన అరబ్ మహిళలకు విడాకులకు (Divorce) అవకాశం లభించడం భారీ ఉపశమనంగా మారింది. దాంతో అరబ్ దేశాలలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు అక్కడ విడాకుల ప్రక్రియను మహిళలు వినియోగించుకోవడం ప్రారంభమైందని పేర్కొంది. 


"విడాకులు తీసుకున్న మహిళలు గతంలో విమర్శించబడ్డారు. కానీ నేడు వారు కోర్టులు, ఇతర ప్రదేశాలలో సంప్రదాయాలను సవాలు చేస్తున్నారు. దాంతో అరబ్ దేశాలలో విడాకుల రేట్లు పెరుగుతున్నాయి" అని నివేదిక తెలియజేసింది. ఉదాహరణకు ఈజిప్టులో ప్రస్తుతం మహిళల విడాకుల రేట్లు రెట్టింపు అయ్యాయి. దీనికి కారణం అక్కడ విడాకులకు సంబంధించిన చట్టాలను సులభతరం చేయడమే. జోర్డాన్, లెబనాన్, ఖతార్, యూఏఈలలో మూడింట ఒక వంతు వివాహాలు విడాకులతో ముగుస్తున్నాయి. అలాగే కువైత్‌లో దాదాపు సగం పెళ్లిలు (Marriages) సైతం విడాకులతోనే ముగుస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా (Saudi Arabia)లో గంటకు ఏడు విడాకులు జరుగుతున్నాయి. అలాగే సగటున రోజుకు 162 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. 


ఇక మరో అరబ్ దేశం ట్యూనీషియాలో ప్రతి నెలా 940 విడాకుల కేసులు నమోదు కాగా, ప్రతి మూడు గంటలకు నాలుగు విడాకుల చొప్పున నమోదవుతున్నాయి. అటు అల్జీరియాలో విడాకుల రేటు భారీ పెరిగింది. ఇక్కడ ఏడాదికి 64వేల విడాకులు నమోదవుతున్నాయి. ఇది ప్రతి 12 నిమిషాలకు ఒక విడాకులకు సమానం. అలాగే జోర్డాన్‌లోనూ ఏటా 14వేల విడాకుల కేసులు నమోదవుతున్నాయి. అనేక దేశాలలో మహిళలు విడాకులు తీసుకునే ప్రక్రియను సులభతరం చేయడం, సంతోషకరమైన వివాహాలపై కుటుంబాల ప్రభావం తగ్గడం, అలాగే సంప్రదాయ నిబంధనలపై కాకుండా ప్రేమ ఆధారంగా వివాహాలు పెరగడం విడాకుల పెరుగుదలకు కారణాలని నివేదిక తెలియజేసింది. 


ఇక "అరబ్ ప్రపంచంలో వివాహాలు సమిష్టి నిర్ణయం నుండి వ్యక్తిగత నిర్ణయంగా మారాయి" అని సామాజిక అధ్యయనాల నిపుణుడు సుమయా నుమాన్ (Sumaya Numaan) అన్నారు. ఈ విషయంపై మతపరమైన అభిప్రాయం తగ్గడంతో పాటు, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడంతో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి వారికి వీలు కలిగింది. దాంతో సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మహిళలకు అవకాశం లభించింది. ప్రస్తుతం మొత్తం 22 అరబ్ దేశాల్లోని మహిళలు ఇలా విడాకుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 

Updated Date - 2022-09-21T14:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising