ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitలో మరణాలపై సర్వేలో షాకింగ్ నిజాలు.. ప్రతీ వంద మందిలో 14 మంది ఆ కారణం వల్లే చనిపోతారంట..

ABN, First Publish Date - 2022-08-13T16:42:44+05:30

కువైత్‌లో మరణాలపై ఓ సర్వే షాకింగ్ నిజాలను వెల్లడించింది. కేవలం ఒకే ఒక్క కారణం వల్ల ప్రతి 100 మందిలో 14 మంది ప్రాణాలు కోల్పోతారని నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్పు రాకుంటే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే‌కు సంబంధించిన నివేదిక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కువైత్‌లో మరణాలపై ఓ సర్వే షాకింగ్ నిజాలను వెల్లడించింది. కేవలం ఒకే ఒక్క కారణం వల్ల ప్రతి 100 మందిలో 14 మంది ప్రాణాలు కోల్పోతారని నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్పు రాకుంటే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే‌కు సంబంధించిన నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. అసలు ఏ అంశంపై సర్వే జరిగింది? వంద మందిలో 14 మంది ప్రాణాలు కోల్పోవాల్సి రావడానికి గల కారణాలు ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



గతంతో పోల్చితే.. మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పలు వచ్చాయి. విలాసవంతమైన, సుఖమైన జీవితాన్ని పొందే ప్రయత్నంలో.. చుట్టూ ఉన్న పరిసరాలను ధ్వంసం చేస్తున్నాం. దీని ఫలితంగా వాతావరణంలో తీవ్రంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏటా ఎండలు అంతకంతా మండిపోతూ.. విపరీతంగా ఉష్న్నాయి. ఈ క్రమంలో కువైత్ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యూపేషనల్ హెల్త్ కొన్ని ప్రముఖ సంస్థలతో కలిసి.. రానున్న వందేళ్లలో అధిక ఊష్ణోగ్రత వల్ల సంభవించే మరణాల సంఖ్యపై సర్వే నిర్వహించింది. తాజాగా అందుకు సంబంధించిన నివేదికను బయటపెట్టింది. అందులోని వివరాల ప్రకారం..


2000-2009 మధ్య కాలం ఆధారంగా రానున్న వందేళ్లలో ఊష్ణోగ్రతలు ఎలా ఉండబోనున్నాయో అంచనా వేసింది. రానున్న 50ఏళ్లలో కువైత్ సగటు ఊష్ణోగ్రతలు 1.80 నుంచి 2.57 డిగ్రీలు పెరగనున్నట్టు అంచనా వేసింది. అదే వందేళ్ల చివరి నాటికి 5.54 డిగ్రీలు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే ఊష్ణోగ్రతల కారణంగా శతాబ్దం చివరి నాటికి ప్రతి 100 మంది ప్రవాస కార్మికుల్లో 14 మంది మృత్యువాతపడతారని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. 


Updated Date - 2022-08-13T16:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising