ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: విదేశీ యాత్రికుల కోసం Haj Ministry సరికొత్త పథకం

ABN, First Publish Date - 2022-07-10T16:27:08+05:30

ఈ ఏడాది విదేశీ హజ్ యాత్రికుల కోసం సౌదీ అరేబియా సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇతర దేశాలకు చెందిన యాత్రికుల కోసం సమగ్ర బీమా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కా: ఈ ఏడాది విదేశీ హజ్ యాత్రికుల కోసం సౌదీ అరేబియా సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇతర దేశాలకు చెందిన యాత్రికుల కోసం సమగ్ర బీమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. ఇది వ్యక్తిగత ప్రమాదాలను కవర్ చేస్తుందని వెల్లడించింది. ఈ బీమా కార్యక్రమం కింద ఏదైనా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం లేదా మరణించిన యాత్రికుల మృతదేహాలను వారి బంధువులు కోరుకుంటే వారివారి దేశాలకు పంపించడం జరుగుతుంది. అలాగే కరోనా నేపథ్యంలో సంస్థాగత నిర్బంధం, చికిత్స వ్యయాలు కూడా దీని కిందకు వస్తాయి. అంతేగాక విమానా రద్దు, ఆలస్యం తదితర కేసులకు సంబంధించిన పరిహారం కూడా వర్తిస్తుంది. 


హజ్, ఉమ్రా యాత్రికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో సౌదీ విజన్ 2030 టార్గెట్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) పర్యవేక్షణలో హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అలాగే తవునియా ఇన్సూరెన్స్ కంపెనీ నేతృత్వంలోని అన్ని స్థానిక బీమా సంస్థల ద్వారా ఈ పథకం అందించబడుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. యాత్రలో భాగంగా యాత్రికులు కరోనా బారిన పడితే వారికి అవసరమయ్యే చికిత్స, క్వారంటైన్ సౌకర్యాలను ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు. ఇక ఈ పథం బెనిఫిట్స్ పొందేందుకు యాత్రికులు తప్పనిసరిగా తమ పాస్‌పోర్ట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. యాత్రికులు దరఖాస్తు కోసం www.enaya-ksa.com వెబ్‌సైట్ ద్వారా లేదా 800440008 నంబర్‌కు కాల్‌ చేయవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-07-10T16:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising