ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mexican అధ్యక్షుడికి రెండోసారి కొవిడ్ పాజిటివ్

ABN, First Publish Date - 2022-01-11T12:44:22+05:30

మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్‌కు రెండవసారి కొవిడ్ బారిన పడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికో సిటీ: మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్‌కు రెండవసారి కొవిడ్ బారిన పడ్డారు. తనకు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయని, కోలుకునే వరకు తాను ఐసోలేషన్ లో ఉంటానని లోపెజ్ ఒబ్రాడోర్ చెప్పారు. 68 ఏళ్ల లోపెజ్ ఒబ్రాడోర్‌కు గత ఏడాది జనవరిలో కూడా కరోనా వైరస్ సోకింది. సోమవారం ఉదయం లోపెజ్ ఒబ్రాడోర్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా గొంతు బొంగురు పోవడంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాను కరోనా నుంచి కోలుకునే వరకూ ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తానని లోపెజ్ ఒబ్రాడోర్ ట్వీట్ చేశారు. లోపెజ్ ఒబ్రాడోర్ డిసెంబరు 7న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ బూస్టర్ షాట్ వేయించుకున్నారు. రక్తపోటుతో బాధపడుతున్న లోపెజ్ 2013లో గుండెపోటుకు గురయ్యాడు. 


తనకు కరోనా సోకడంతో మెక్సికో దేశ అంతర్గత శాఖ మంత్రి అడాన్ అగస్టో అధ్యక్షుడి స్థానంలో అధికారిక కార్యక్రమాలు చేపడతారని ఒబ్రాడోర్ చెప్పారు.మెక్సికో అధ్యక్షుడు విమానాలలో తప్ప ఫేస్ మాస్క్ ధరించి బహిరంగంగా చాలా అరుదుగా కనిపించారు. మెక్సికో దేశంలోకి ప్రవేశించే ప్రయాణికులపై చాలా తక్కువ పరిమితులను విధించింది. మెక్సికోలో ఒక్కరోజే 30,671 కరోనా కేసులు నమోదైనాయి. 


Updated Date - 2022-01-11T12:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising