ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో గ్యాంగ్‌వార్.. ఇద్దరు భారత సంతతి యువకుల హత్య..

ABN, First Publish Date - 2022-07-26T02:48:18+05:30

కెనడాలో(Canada) ఆదివారం జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఇద్దరు భారత సంతతి యువకులు(Indian orgin) మృతి చెందారు. విస్లర్స్ విలేజ్(Whislter's village) అనే టౌన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) ఆదివారం జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఇద్దరు భారత సంతతి యువకులు(Indian orgin) హత్యకు గురయ్యారు. విస్లర్స్ విలేజ్(Whislter's village) అనే టౌన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. మృతులను మణీందర్ ధలీవాల్, సతింద్రా గిల్‌గా స్థానిక పోలీసులు గుర్తించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మణీందర్.. బ్రదర్స్ కీపర్స్ అనే గ్యాంగ్‌లో సభ్యుడని సమాచారం. ఆదివారం నాడు మణీందర్‌ను టార్గెట్ చేసుకుని జరిగిన కాల్పుల్లు అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అతడి స్నేహితుడు సతీంద్రా గిల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సతీంద్రాకు ఈ గ్యాంగ్ వార్‌తో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. 


కాల్పుల నేపథ్యంలో పోలీసులు విస్లర్స్ టౌన్‌లో లాక్‌డౌన్ విధించారు. ఇక గతేడాది.. ధలీవాల్ అన్న హార్బ్ కూడా ఇదే తరహాలో తూటాలకు బలయ్యాడు. లోయర్ మెయిన్‌ల్యాండ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య గొడవలో భాగంగానే కాల్పులు జరిగినట్టు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. కాగా.. ఆదివారం నాటి కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక.. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో మంటల్లో కాలిపోతున్న ఓ వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మణీందర్ హత్యకు, ఈ ఘటనకు సంబంధం ఉందనే నిర్ధారణకు వారు వచ్చారు. 

Updated Date - 2022-07-26T02:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising