ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల్లో ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కేంద్రం మరో హెచ్చరిక!

ABN, First Publish Date - 2022-09-25T03:18:22+05:30

విదేశాల్లో ఐటీ ఉద్యోగాల పేరిట జరుగుతన్న మోసాల బారినపడ్డొద్దంటూ విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విదేశాల్లో ఐటీ ఉద్యోగాల పేరిట జరుగుతన్న మోసాల బారినపడ్డొద్దంటూ విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. కొన్ని నకిలీ ఐటీ సంస్థలు థాయ్‌ల్యాండ్‌లో ఐటీ జాబుల పేరిట ర్యాకెట్ నడుపుతున్నాయని హెచ్చరించింది. ఆయా సంస్థలు క్రిప్టోకరెన్సీ నేరాలు, టెలీమార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న విషయం థాయ్‌ల్యాండ్‌లోని భారత రాయబార కార్యాలయాల దృష్టికి వచ్చినట్టు కూడా పేర్కొంది. విదేశీ కొలువుల కోసం ప్రయత్నిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియా అడ్వటైజ్‌మెంట్లు, భారత్‌లోని తమ ఏజెంట్లతో ఈ తరహా నేరాలకు తెరలేపాయని చెప్పింది. ఇటువంటి మోసాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. 


మీడియా కథనాల ప్రకారం.. ఈ జాబ్ రాకెట్ బారిన పడ్డ బాధితులు థాయ్‌ల్యాండ్ చేరుకున్నాక నేరగాళ్లు వారిని మయాన్మార్‌లోకి అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ వారితో బలవంతంగా క్రిప్టోకరెన్సీ సంబంధిత మోసాలు, టెలీమార్కెటింగ్ స్కామ్‌లు చేయిస్తున్నారు. విదేశాంగ శాఖ సూచనల ప్రకారం.. విజటర్ లేదా టూరిస్ట్ వీసాపై విదేశాలకు ఉద్యోగ సంబంధిత కారణాలతో వెళ్లేవారు.. విదేశీ సంస్థల గురించి క్షుణ్ణంగా విచారించుకోవాలని సూచించింది. ఈ విషయంలో అక్కడి భారతీయ రాయబార కార్యాలయాల సహకారం తీసుకోవాలని చెప్పింది. అయితే.. మయాన్మార్ కేంద్రంగా ఉన్న ఫెక్ జాబ్ ర్యాకెట్‌లో చిక్కుకున్న 30 మంది భారతీయులను కేంద్రం ప్రభుత్వం ఇటీవలే సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది.

Updated Date - 2022-09-25T03:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising