ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రంలో సీట్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-05-02T12:21:22+05:30

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పించాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ స్టూడెంట్స్‌ కోరింది. ఈ వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతకాలు సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు

చంపాపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పించాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ స్టూడెంట్స్‌ కోరింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీల్లో సదరు విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కోరింది.


ఈ మేరకు చంపాపేట డివిజన్‌ కర్మన్‌ఘాట్‌లో పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. రాష్ట్రం నుంచి సుమారు 720మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని యూనివర్సిటీల్లో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతకాలను సేకరించారు. సంతకాల ప్రతులను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు.




Updated Date - 2022-05-02T12:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising