ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Teacher GOAT: విద్యార్థుల తీరుతో స్కూల్ టీచర్‌లో అనుమానం.. క్లాసులో అందరూ ఆమెను ‘మేక’ అని పిలుస్తుండటంతో..

ABN, First Publish Date - 2022-07-02T00:11:01+05:30

తరాలు మారే కొద్దీ కొత్త పదాలు ఉనికిలోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో పాత పదాలకే కొత్త అర్థాన్ని ఇస్తుంది యువతరం. కానీ.. ఈ సరికొత్త ట్రెండ్ల పట్ల అంతగా అవగాహన లేని పెద్దవాళ్లు ఒక్కోసారి యువత తీరు అర్థంకాక తెల్లముఖం వేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తరాలు మారే కొద్దీ కొత్త పదాలు ఉనికిలోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో పాత పదాలకే కొత్త అర్థాన్ని ఇస్తుంది యువతరం. కానీ.. ఈ సరికొత్త ట్రెండ్ల పట్ల అంతగా అవగాహన లేని పెద్దవాళ్లు ఒక్కోసారి  తెల్లముఖం వేస్తుంటారు. అమెరికాలోని ఓ స్కూల్ టీచర్ కూడా ఇలాగే షాకైపోయింది. ఏడాదిగా స్టూడెంట్లు అందరూ తనను గోట్(GOAT) అని పిలుస్తుండటంతో ఆమెకు అసలు క్లాసులో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వాస్తవానికి విద్యార్థులందరికీ ఆమె అంటే ఎంతో అభిమానం. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. కాబట్టి వారు తనను మేక అని పిలుస్తున్నట్టు ఆమె అనుకోలేదు. అందుకే..  స్టూడెంట్లు ఆమెను గోట్ అన్న ప్రతిసారీ మీరే గోట్స్ అంటూ ప్రతిస్పందించేది. దీంతో.. క్లాసంతా గొల్లున నవ్వేవారు. గత ఏడాదంతా వ్యవహారం ఇలాగే సాగింది. అయితే.. ఎడతెగకుండా సాగుతున్న ఈ వ్యవహారం అంతు తెల్చేందుకు ఇటీవలే ఆమె ఇంటర్నెట్‌ను ఆశ్రయించింది. ప్రముఖ చర్చా వెబ్‌సైట్‌ రెడిట్‌లో(Reddit) తన అనుభవాన్ని పంచుకుంది. 


‘‘నన్ను నా స్టూడెంట్లు అందరూ గోట్(Goat) అని పిలుస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. వాళ్లు నన్ను గోట్ అన్న ప్రతిసారీ మీరే గోట్ అని నేను సమాధానమిస్తున్నా. దీంతో.. పిల్లలందరూ పెద్దపెట్టున నవ్వుతున్నారు. ఇదంతా భలే సరదాగా ఉంది. ఏడాదిగా స్కూల్లో ఇలా జరుగుతోంది. వారందరికీ నేనంటే ఎంతో అభిమానం. క్లాసులో పిల్లలందరూ ఎంతో బుద్ధిగా నడుచుకుంటారు. కాబట్టి.. వారు నన్ను మేక అంటూ హేళన చేయట్లేదనేది నా నమ్మకం. కానీ.. అసలు అక్కడ జోక్ ఏంటో నాకు పూర్తిగా అర్థం కాలేదనిపించింది. కాబట్టి ఎవరైనా అసలు విషయం ఏంటో వివరించండి’’ అంటూ రెడిట్‌లో(Reddit) పోస్ట్ పెట్టిందా టీచర్. ఆ పోస్ట్ వైరల్ అయి నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(Greatest Of All Time) అనే వాక్యానికి సంక్షిప్త రూపమే గోట్(GOAT) అని చెప్పుకొచ్చారు. ‘‘మీలాంటి గొప్ప టీచర్‌ను ఈ ప్రపంచం ఇప్పటివరకూ చూడలేదు(GOAT) అంటూ వాళ్లు మిమ్మల్ని పొగిడారు. కానీ.. మీకు విషయం అర్థం కాక ‘‘మీరే గోట్’’ అని వారితో అనడటంతో పిల్లలందరూ పకపకా నవ్వుతున్నారు’’ అని ఓ నెటిజన్ వివరించారు. దీంతో.. ఆశ్చర్యపోయడం ఆ టీచర్ వంతైంది.

Updated Date - 2022-07-02T00:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising