ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WORK FROM HOME.. త్వరలో కోటీశ్వరుడినైపోతా.. ఓ వ్యక్తి సంచలన ప్రకటన! ఆ కిటుకు చెప్పాలంటూ ఎగబడుతున్న నెటిజన్లు...

ABN, First Publish Date - 2022-02-14T02:22:26+05:30

ఓ వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం హోం సంస్కృతి తనకు అనుకూలంగా మార్చుకున్నానని ప్రకటించుకున్నాడు. త్వరలోనే కోటీశ్వరుడైపోతానని నెట్టింట చాటింపు వేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో వర్క్ ఫ్రం హోం కల్చర్ ఒకటి. ఈ పద్ధతి ద్వారా అనేక మంది ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండానే జీతాలు తెచ్చుకుంటున్నారు. అయితే.. పని భారం విపరీతంగా పెరిగిపోయిందన్న వారు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. తమకు గాబరా విపరీతంగా పెరిగి రోగాల బారినపడుతున్నామని వాపోయిన వారూ ఉన్నారు. అయితే... ఓ వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం హోం సంస్కృతి తనకు అనుకూలంగా మార్చుకున్నానని ప్రకటించుకున్నాడు. త్వరలోనే కోటీశ్వరుడైపోతానని నెట్టింట చాటింపు వేశాడు. ఇంటి నుంచే పని చేసే సౌలభ్యం కారణంగా తాను ఏకంగా ఆరు ఉద్యోగాలు చేస్తున్నానని, ఈ సంవత్సరం  రూ. 5 కోట్లు సంపాదిస్తానని ఆన్‌లైన్ చర్చా వేదిక రెడిట్‌లో తన అనుభవాన్ని వివరించాడు. 


తాను చేస్తున్న ఉద్యోగాలన్నీ రోజులో ఆరు గంటలకు పైగా పనిచేయాల్సిన ఫుల్ టైం జాబ్స్ అని చెప్పుకొచ్చాడు. పని కొంత మందకొడిగా సాగుతున్నా క్వాలిటీ బాగుండటంతో తనపై ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదులూ రాలేదని చెప్పుకొచ్చాడు. అయితే.. తన పేరు, ఇతర వివరాలను మాత్రం ప్రస్తావించలేదు. అతడి కాన్ఫిడెన్స్ చూసిన అనేక మంది..‘‘ఆ కిటుకేదో మాకూ చెప్పొచ్చుగా’’ అంటూ తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం అతడి నైతిక విలువలను ప్రశ్నించారు. మరికొందరు మాత్రం అతడు సాధారణ ఉద్యోగి కాదని, కాంట్రాక్ట్ పనికి కుదురుకున్న వాడు అయ్యుండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు. అధికశాతం మంది మాత్రం అతడి శ్రమను మెచ్చుకుంటూ, ఆ కిటుకులను తమకూ నేర్పాలంటూ కోరారు.

Updated Date - 2022-02-14T02:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising