ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: డాక్టర్లు ఎంత పని చేశారు.. కొంచెం ఉంటే ఘోరం జరిగిపోయేది!

ABN, First Publish Date - 2022-09-07T22:39:26+05:30

అతడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు కూడా వెంటనే చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. అతడి బ్రెయిన్ డెడ్(Brain Dead) అయిందని పేర్కొన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అతడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు కూడా వెంటనే చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. అతడి బ్రెయిన్ డెడ్(Brain Dead) అయిందని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో అతడి శరీరంలోంచి అవయవాలను తీసేందుకు సిద్ధం అయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికా(America)లోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ర్యాన్ మార్లో (Ryan Marlow).. పాస్టర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ర్యాన్ మార్లోకు వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు.. అతడి మెదడుకు ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఆ వెంటనే చికిత్స కూడా ప్రారంభిచారు. ఇంతలోనే డాక్టర్లు అతడి కుటంబ సభ్యులకు షాకింగ్ విషయం  చెప్పారు. ర్యాన్ మార్లో.. బ్రెయిన్ డెడ్ అయినట్టు వెల్లడించారు. అది విని అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతడు గతంలో ఆర్గాన్ డొనేషన్‌(organ donation) చేసేందుకు రిజిస్టర్ చేయించుకున్నట్టు గుర్తించిన వైద్యులు.. ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ర్యాన్ మార్లో కుటుంబ సభ్యులు.. పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియా(Social Media)లో ఆ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయసాగారు. ఇంతలో ర్యాన్ మార్లో మేనకోడలు.. అతడి కాళ్లలో చలనాన్ని గమనించింది. 



అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ర్యాన్ మార్లో భార్య స్పందిస్తూ.. తన భర్తకు మరోసారి వైద్య పరీక్షలు చేయాల్సిందిగా డాక్టర్లను కోరింది. దీంతో వైద్యులు అతడికి మరోసార్టి టెస్టులు చేశారు. రిపోర్టుల్లో వచ్చిన వివరాలను చూసి వైద్యుల మైండ్ బ్లాంక్ అయింది. ర్యాన్ మార్లో మెదడు యాక్టివ్ ఉన్నట్టు రిపోర్టుల్లో తేలడంతో వైద్యులు కంగుతిన్నారు. అదే విషయాన్ని అతడి భార్యకు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల ముందుకు వచ్చిన ఆమె.. విషయాన్నంతటినీ వివరించింది. దేవుడే తన భర్తను కాపాడారని పేర్కొంది. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. పిల్లల వీడియోను చూసిన తర్వాత ర్యాన్ మార్లో కాళ్లలో చలనం వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అతడి పరిస్థితి మెరుగుపడలేదు.


Updated Date - 2022-09-07T22:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising