ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానంలోని టాయిలెట్‌లో షాకింగ్ సీన్.. చెత్తడబ్బాలో మూట.. సిబ్బందికి అనుమానమొచ్చి మూట విప్పతిస్తే..

ABN, First Publish Date - 2022-01-05T00:19:48+05:30

విమానం టాయిలెట్‌లో షాకింగ్ సిన్.. చెత్తబుట్టలో తొంగి చూసి అవాక్కైన సిబ్బంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అది మారిషస్ అంతర్జాతీయ విమానాశ్రయం. మెడగాస్కర్ నుంచి ఓ విమానం అప్పుడే ల్యాండైంది.  ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తరువాత ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఓ దారుణ దృశ్యం వారి కంట పడింది. విమానం టాయి‌లెట్‌లో ఉన్న చెత్త డబ్బాలో తువాలుతో చుట్టి ఉన్న ఓ మూట ఒకటి వారికి కనిపించింది. అది కుదులుతున్నట్టు అనిపించడంతో వారికి అనుమానం కలిగింది. ఈ క్రమంలో వారు మూట విప్పదీసి చూడగా..అందులో నవ జాత శిశువు కనిపించడంతో వారు ఒక్కసారిగా షాకైపోయారు. ఆ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. జనవరి 1న వెలుగు చూసిన ఘటన ఇది. 


అదే విమానంలో ప్రయాణించిన ఓ యువతిపై అనుమానం కలగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తనకేమీ సంబంధం లేదని తొలుత బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమెకు వైద్య పరీక్షలు జరపడంతో.. కొద్ది గంటల ముందే ఆమె ప్రసవించినట్టు బయటపడింది. విమానంలోని టాయిలెట్‌లో బిడ్డను కని అక్కడే వదిలేసి వెళ్లిపోయేందుకు ఆమె ప్రయత్నించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం యువతి పోలీసు నిఘాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి, బిడ్డలు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. యువతి పూర్తిగా కోలుకున్నాక మరింత లోతైన విచారణ చేపటన్నున్నారు. శిశువును వదిలించుకునే ప్రయత్నం చేసినందుకు ఆమెపై కేసు పెట్టారు. కాగా.. మెడగాస్కర్‌కు చెందిన ఆమె.. రెండేళ్ల కాలపరిమితి గల ఉద్యోగ వీసాపై మారిషస్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-05T00:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising