ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Britain pm elections: మారని సీన్.. బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడ్డ రిషి.. తాజా సర్వే తేల్చిందిదే!

ABN, First Publish Date - 2022-08-05T03:32:27+05:30

బ్రిటన్ ప్రధాని పదవి(Britain pm elections) కోసం జరుగుతున్న పోటీలో ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్(Lizz truss) దూసుకుపోతున్నట్టు తాజా సర్వేలో బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని పదవి(Britain pm elections) కోసం జరుగుతున్న పోటీలో ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్(Lizz truss) దూసుకుపోతున్నట్టు తాజా సర్వేలో బయటపడింది. ఆమె ప్రధాని అభ్యర్థి, భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్(Rishi sunak) రేసులో వెనకబడ్డారని తేలింది. అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు కోల్పోవడంతో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో.. అధికార పార్టీ సభ్యులు తమ తదుపరి నేతను ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా మొదలైన పోటీలో తొలుత రిషి సునాక్ పైచేయి సాధించినప్పటికీ.. మలివిడత ప్రచారంలో లిజ్ ట్రస్ దూసుకుపోతున్నారు. 


తాజా సర్వే ప్రకారం.. అధికార పార్టీ సభ్యుల్లో 58 శాతం మంది లిజ్ ట్రస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక రిషి సునాక్‌కు మాత్రం 26 శాతం మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. మరో 12 శాతం మంది మాత్రం తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఇరు నేతల జనామోదంపై బుధవారం విడుదలైన రెండో సర్వే ఇది. అంతకుమునుపు.. జరిగిన yougov పోల్‌లో కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు వెలువడ్డాయి. బ్రిటన్‌లోని అన్ని వర్గాల ప్రజల్లో లిజ్ ట్రస్‌కు మద్దతు పెరుగుతోందని ఆ సర్వేలో తేలింది. చిన్నా పెద్దా, ఆడా మగా ఇలా అందరూ లిజ్ ట్రస్ వెంట నిలిచేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ‘‘ఆటను సమూలంగా మార్చేసేలా రిషి ఏదైనా చేస్తేనే లిజ్ ట్రస్‌ను వెనక్కు నెట్టగలరు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది.’’ అని సర్వే నిర్వహించిన సంస్థ వ్యాఖ్యానించింది.  

Updated Date - 2022-08-05T03:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising