ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: భారత సంతతి వైద్యుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం!

ABN, First Publish Date - 2022-08-15T00:10:25+05:30

భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. లివర్‌పూల్‌కు(Liverpool) చెందిన డా. శివ్ పటేల్‌ను స్థానిక ప్రభుత్వం ‘సిటిజన్ ఆఫ్ హానర్’ అవార్డుతో సత్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. లివర్‌పూల్‌కు(Liverpool) చెందిన డా. శివ్ పటేల్‌ను స్థానిక ప్రభుత్వం ‘సిటిజన్ ఆఫ్ హానర్’(Citizen of Honour) అవార్డుతో సత్కరించింది. నగరానికి విశేషసేవలందించిన వివిధ రంగాల ప్రముఖులకు లివర్‌పూర్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ అవార్డును ఇస్తుంది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి ఆసియా సంతతి వ్యక్తి డా. శివ్ పటేల్ కావడం విశేషం. భారత్‌లో వైద్యవిద్యను అభ్యసించిన డా. శివ్ పటేల్ 1971లో బ్రిటన్‌కు తరలివెళ్లారు. నగరంలోని బ్రోడ్‌గ్రీన్ ఆస్పత్రిలో సర్జన్‌గా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 30 ఏళ్ల పాటు వెనకబడిన వర్గాలకు వైద్యసేవలందించారు. అంతేకాకుండా..  స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే డా. పటేల్  జనరల్ మెడికల్‌ కౌన్సిల్‌కు ట్రెజరర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ట్రెజరర్ పదవికి మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపిక కావడం అదే ప్రథమం. 


నేషనల్ హెల్త్ సర్వీసెస్‌కు వివిధ ఆసియా దేశాల వారిని ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ప్రొఫెషనల్ అండ్ లింగ్వస్టిక్స్ అసెస్‌మెంట్ బోర్డు పరీక్ష రూపకల్పనలోనూ డా.పటేల్ కీలక పాత్ర పోషించారు. కొత్తగా బ్రిటన్‌కు వచ్చిన ఆసియా దేశాల వారికి వినియోగదారులుగా తమకున్న హక్కులపై అవగాహన కల్పించే టీవీ కార్యక్రమానికి 14 ఏళ్ల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వైద్య రంగంలో డా. పటేల్‌ కృషికి గాను..ఆయనకు ప్రతిష్టాత్మక మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ అంపైర్ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన యూనివర్శిటీ బోల్టన్, గువహటీ యూనివర్శిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్‌లో హానరరీ ఫెలోగా ఉన్నారు.

Updated Date - 2022-08-15T00:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising