ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: పేరెంట్స్‌కు పోలీసుల వార్నింగ్.. పిల్లలను ఒంటరిగా వదిలివెళ్లడం నేరమంటూ..

ABN, First Publish Date - 2022-07-23T14:22:23+05:30

సమ్మర్ సేఫ్ క్యాంపెయిన్‌లో భాగంగా అబుదాబి పోలీసులు వాహనదారులు, తల్లిదండ్రులకు పిల్లల విషయమై వార్నింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: సమ్మర్ సేఫ్ క్యాంపెయిన్‌లో భాగంగా అబుదాబి పోలీసులు వాహనదారులు, తల్లిదండ్రులకు పిల్లల విషయమై వార్నింగ్ ఇచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి కనుక పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలి వెళ్లకూడదని హెచ్చరించారు. షాపింగ్, ఇతర కారణాలతో బయటకు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివెళ్లడం జరుగుతుంది. దాంతో పిల్లలకు వాహనాల్లో ఊపిరాడక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనల్లో నేరం రుజువైతే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివెళ్లడంతో కొన్నిసార్లు పిల్లలు లోపలి నుంచి డోర్లను లాక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరూ గమనించకపోతే వారికి ఊపిరాడక మరణానికి దారితీస్తుంది. ఒక్కొసారి పిల్లలు వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు కారణమవుతుంటారు. దీంతో పాటు దుండగులు పిల్లలు వాహనాల్లో ఒంటరిగా ఉండడం చూసి వెహికల్‌ను అపహరించుకోని వెళ్లడం లేదా పిల్లలను కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేయడం జరుగుతుందని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇకపై పిల్లలను పేరెంట్స్ వాహనాల్లో ఒంటరిగా వదిలివెళ్లకూడదని హెచ్చరించారు. ఒకవేళ తల్లిదండ్రులపై ఇలాంటి ఘటనల్లో నేరం రుజువైతే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 



Updated Date - 2022-07-23T14:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising