ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటిపై నిషేధాన్ని తీసేయండి.. భారత్‌ను కోరనున్న Kuwait

ABN, First Publish Date - 2022-06-01T18:46:34+05:30

దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఇటీవల భారత్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఇటీవల భారత్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. అయితే, ఈ నిషేధం నుంచి కువైత్‌ను మినహాయించాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్ షరియన్ కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జ్‌తో భేటీ కానున్నారు. ఇక కువైత్, భారత్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇతర దేశాలతో పోలిస్తే గోధుమ ఎగుమతిపై నిషేధాన్ని సడలించే అవకాశం ఉందని అక్కడి ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల దృష్ట్యా కువైత్‌కు ఆహార ధాన్యాల ఎగుమతుల కొనసాగింపును నిర్ధారించే విషయమై మంత్రి అల్ షరియాన్ ఇప్పుడు భారత రాయబారితో సమావేశం కానుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Updated Date - 2022-06-01T18:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising