ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఇతరుల అనుమతి లేకుండా అలా చేస్తున్నారా.. అయితే మీకు రెండేళ్ల జైలు శిక్ష తప్పదు!

ABN, First Publish Date - 2022-08-14T19:17:31+05:30

స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరుల ఫొటోలు, వీడియోలను కూడా వారి అనుమతి లేకుండా చిత్రీకరించి.. వాటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఫొటోలు(Photos), వీడియోలు(Videos) తీసి సోషల్ మీడియాల్లో(Social Media) పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరుల ఫొటోలు, వీడియోలను కూడా వారి అనుమతి లేకుండా చిత్రీకరించి.. వాటినీ అప్‌లోడ్ చేసేస్తున్నారు. అయితే ఈ విషయంపై కువైత్ ప్రభుత్వం(Kuwait Govt) అక్కడి ప్రజలను హెచ్చరించింది. అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు చిత్రీకరించవద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. 


2014 నాటి చట్టం నం. 37లోని ఆర్టికల్ 70 ప్రకారం అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు తీస్తే దాన్ని నేరంగా పరిగణించనున్నట్టు వెల్లడించింది. తెలియకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు తీయడం వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడం ద్వారా ఒక్కోసారి సదరు వ్యక్తుల పరువుకు భంగం కలిగే అవకాశం ఉందని వివరించింది. అందువల్ల ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు సుమారు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 3000 కువైత్ దినార్లు జరిమానాగా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 


Updated Date - 2022-08-14T19:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising