ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ప్రవాసులకు చెత్త ప్రదేశంగా కువైత్.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు!

ABN, First Publish Date - 2022-07-19T15:25:11+05:30

ఇంటర్ నేషన్స్-2022 (Inter Nations Survey) సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ఇంటర్ నేషన్స్-2022 (Inter Nations Survey) సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ సర్వే విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రవాసులకు అత్యంత చెత్త ప్రదేశంగా కువైత్ నిలిచింది. అలాగే ఇతర పలు విషయాల్లో సైతం ఇంటర్ నేషన్స్ విడుదల చేసిన రిపోర్టులో కువైత్ చివరి స్థానాల్లో నిలవడం గమనార్హం. గల్ఫ్ దేశాల పరంగా ప్రవాసుల నివాసానికి యూఏఈ (UAE) అత్యంత అనుకూలమైన ప్రదేశంగా ఈ రిపోర్టులో మొదటి ర్యాంక్ దక్కించుకుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌తో పాటు నేచురల్ ఎన్విరాన్మెంట్ పట్ల ప్రవాసులు కువైత్‌లో అంతగా సంతృప్తిగా లేరని ఈ నివేదిక తేల్చింది. తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ మిగతా దేశాలతో పోలిస్తే ఈ గల్ఫ్ దేశంలో చాలా తక్కువని వలసదారులు చెప్పినట్లు రిపోర్టు వెల్లడించింది. 57 శాతం మంది ప్రవాసులు ఇదే విషయాన్ని చెప్పినట్లు పేర్కొంది. ఇక వలసదారులతో స్థానికులు స్నేహపూర్వకంగా కూడా ఉండరని 44 శాతం తెలియజేశారు. మొత్తం మీద కేవలం 37 శాతం ప్రవాసులు మాత్రమే కువైత్‌లో తమ లైఫ్ సాఫీగా కొసాగుతున్నట్లు చెప్పారని నివేదిక స్పష్టం చేసింది. 


కువైత్ కాకుండా ఈ జాబితాలో అట్టడుగున ఉన్న దేశాలు.. న్యూజిలాండ్, హాంకాంగ్, సైప్రస్, లక్సెంబర్గ్, జపాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇటలీ, మాల్టా ఉన్నాయి. ఇక ప్రవాసులకు అత్యంత అనుకూలమైన టాప్-10 దేశాలుగా మెక్సికో, ఇండోనేషియా, తైవాన్, పోర్చుగల్, స్పెయిన్, యూఏఈ, వియత్నాం, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ నిలిచాయి.  


Updated Date - 2022-07-19T15:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising