ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణ ఆంక్షలపై కీలక సిఫార్సులకు కువైత్ ఆమోదం

ABN, First Publish Date - 2022-02-10T18:58:59+05:30

కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలు, హెల్త్ గైడ్‌లైన్స్‌ల విషయమై పలు కీలక సిఫార్సులకు కువైత్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) బుధవారం ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలు, హెల్త్ గైడ్‌లైన్స్‌ల విషయమై పలు కీలక సిఫార్సులకు కువైత్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) బుధవారం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటి సిఫార్సు.. టీకా తీసుకోని వారికి విధించిన ప్రయాణ ఆంక్షలను వెంటనే ఎత్తివేయడం. అలాగే వారికి ఏ దేశాల్లోనైతే ఎంట్రీకి అనుమతి ఉందో ఆయా దేశాలకు వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం. రెండో సిఫార్సు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని 'కంప్లీట్ వ్యాక్సినేటేడ్‌'గా గుర్తించడం. మూడో సిఫార్సు.. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలతో పాటు తీసుకోని చిన్నారులను కూడా సమానంగా చికిత్స అందించడం. నాలుగో సిఫార్సు.. విదేశాల నుంచి వచ్చే కువైత్ పౌరులకు కేవలం సింగిల్ పీసీఆర్ టెస్టు ద్వారా ఎంట్రీకి అనుమతించడం. అది కూడా అరైవల్ సమయంలోనే టెస్టు నిర్వహించడం. ఐదో సిఫార్సు.. కరోనా వ్యాక్సినేషన్‌పై పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం. ఇలా ఐదు కీలక సిఫార్సులను కువైత్ పార్లమెంట్ బుధవారం ఆమోదించింది.   

Updated Date - 2022-02-10T18:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising