ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: తెరపైకి ఎంపీ కొత్త ప్రతిపాదన.. ప్రవాసులు, నివాసితులకు కొత్త కండిషన్..!

ABN, First Publish Date - 2022-05-25T14:12:27+05:30

కువైత్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒసామా అల్ మనావర్ తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒసామా అల్ మనావర్ తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. నివాసితులు, ప్రవాసులు ఇకపై కువైత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే వారికి ఉన్న అన్ని జరిమానాలు క్లియర్ చేయాలనే ప్రతిపాదనను మనవార్ పార్లమెంట్ ముందు ఉంచారు. ఈ సందర్భంగా రెసిడెన్సీ చట్టానికి కొత్త ఆర్టికల్‌ను యాడ్ చేయాలని ఆయన కోరారు. నివాసితులు తప్పనిసరిగా ఫైన్స్ రూపంలో ప్రభుత్వానికి బాకీ పడ్డ నగదును చెల్లించాకే దేశం విడిచి వెళ్లాలనే సవరణను రెసిడెన్సీ యాక్ట్‌కు యాడ్ చేయాలని ఎంపీ సూచించారు. సర్వీస్ ఫీజులు, ఫైనాన్షియల్ ఫైన్స్, ట్రాఫిక్ జరిమానాలు తదితర వాటిని దీనిలో చేర్చాలని ఆయన పేర్కొన్నారు. అయితే, తన ప్రతిపాదన నుంచి జీసీసీ రెసిడెంట్స్, రాయబార కార్యాలయాలకు చెందిన దౌత్యవేత్తలు, కువైత్ పాస్‌పోర్టు కలిగిన వారికి మినహాయింపు ఇచ్చారు. అలాగే అంతర్గత మంత్రిత్వశాఖ చర్చల అనంతరం మరికొన్ని కేటగిరీల వారికి కూడా దీని నుంచి మినహాయింపు ఇచ్చే విషయాన్ని ఆలోచించాల్సిందిగా మనవార్ సూచించారు. 

Updated Date - 2022-05-25T14:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising