ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ గృహ కార్మికులపై విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన Kuwait MP.. కారణమిదే!

ABN, First Publish Date - 2022-06-21T16:30:43+05:30

కొంతమంది భారతీయ గృహ కార్మికులు కువైత్ వచ్చినప్పుడు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌లను సమర్పించారనే విషయమై ఎంపీ ముబారక్ అల్ హజ్రఫ్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాసర్ అల్ ముహమ్మద్‌కు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కొంతమంది భారతీయ గృహ కార్మికులు కువైత్ వచ్చినప్పుడు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌లను సమర్పించారనే విషయమై ఎంపీ ముబారక్ అల్ హజ్రఫ్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాసర్ అల్ ముహమ్మద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గృహ కార్మికుల స్పాన్సర్‌లు తమ ఉద్యోగుల వర్క్ పర్మిట్‌ల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. కార్మికులు సమర్పించిన పత్రాలపై ఇండియాలోని కువైత్ రాయబార కార్యాలయం స్టాంప్ ఉన్నప్పటికీ, వారి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు నకిలీవని తేలడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైందనేది అంతుచిక్కని ప్రశ్నగా ఎంపీ పేర్కొన్నారు. ఇది కేవలం ఎంబసీ స్టాంపులను దొంగిలించి స్టాంప్ చేసుకుంటే తప్పితే వేరే విధంగా సాధ్యపడదని ఆయన తెలిపారు. ఒకవేళ భారతదేశంలోని కువైత్ రాయబార కార్యాలయం ఈ మధ్య తన స్టాంపులు ఏమైనా దొంగిలించబడ్డాయని ఫిర్యాదు చేసిందా? ఒకవేళ చేస్తే దొంగిలించబడిన స్టాంపుల సంఖ్యను నివేదించిందా? దీనిపై తీసుకున్న చర్యలు తదితర విషయాలను తెలుసుకోవాలని ఉందంటూ విదేశాంగ శాఖకు ఎంపీ ముబారక్ అల్ హజ్రఫ్ ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-06-21T16:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising