ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఆ ప్రవాసులే లక్ష్యంగా కువైత్ కొత్త సర్వీస్.. ఈసారి ఏకంగా వర్క్ పర్మిట్లకే ఎసరు!

ABN, First Publish Date - 2022-09-28T14:51:10+05:30

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) రెసిడెన్సీ ఫార్మాలిటీలను పూర్తి చేయని పరారీలో ఉన్న ప్రవాసుల కోసం కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) రెసిడెన్సీ ఫార్మాలిటీలను పూర్తి చేయని పరారీలో ఉన్న ప్రవాసుల కోసం కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. వర్క్ పర్మిట్లపై కువైత్‌కి వచ్చి రెసిడెన్సీ ఫార్మాలిటీలను(Residency formalities) పూర్తి చేయకుండా తప్పించుకుని తిరుగుతున్న వలసదారులను గుర్తించేందుకు ఈ కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు పీఏఎం(PAM) వెల్లడించింది. 


దీనికోసం అస్సాల్ యాప్(Asshal app)ను వినియోగించుకోవాలని సూచించింది. తమ వద్ద వర్క్ పర్మిట్లపై పనికి కుదిరి ఆ తర్వాత కనిపించకుండా పోయిన వలస కార్మికులపై యజమానులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. యాప్‌లోకి వెళ్లిన తర్వాత 'లేబర్ రిలేషన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో వెళ్లిన తర్వాత ఫిర్యాదు కోసం 'న్యూ రిక్వెస్ట్‌'పై క్లిక్ చేయాలి. అనంతరం వర్కర్ లైసెన్స్ టైప్, కార్మికుడి పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'డిటైల్స్‌'పై క్లిక్ చేసి కార్మికుడు కనిపించకుండా పోయిన 'తేదీ' ఇచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫిర్యాదు రిజిస్టర్ అవుతుంది. ఇలా ఫిర్యాదు నమోదైన ఏడు రోజుల తర్వాత సదరు కార్మికుడి వర్క్ పర్మిట్ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. దాంతో ఆ వర్కర్ కువైత్‌లో ఉండేందుకు అవకాశం ఉండదు.  


Updated Date - 2022-09-28T14:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising