ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait Court: ప్రవాసుడికి రెండేళ్ల జైలు.. రూ.14కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు.. ఇంతకు అతడు ఏం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-07-21T14:25:36+05:30

కువైత్ క్రిమినల్ కోర్టు తాజాగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.14కోట్లు అతడు పనిచేసిన సంస్థకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ క్రిమినల్ కోర్టు తాజాగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.14కోట్లు అతడు పనిచేసిన సంస్థకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్‌కు చెందిన ప్రవాసుడు, ఫహహీల్ కోఆపరేటివ్ సోసైటీలో పని చేశాడు. ఆ సమయంలో భారీ అవకతవకలకు పాల్పడ్డాడు. అలా ఒకటికాదు రెండుకాదు ఏకంగా 5.40లక్షల కువైటీ దినార్ల(రూ.14.04కోట్లు) సోసైటీ నిధులను స్వదేశంలోని అతని బ్యాంక్ ఖాతాకు మళ్లీంచాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సోసైటీలో ఉద్యోగం మానేసి స్వదేశానికి చెక్కేశాడు. 


ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఫ్రాడ్ జరిగినట్టు నిర్దారించారు. నకిలీ రసీదులతో ప్రవాసుడు పలు దఫాలలో ఏకంగా రూ.14కోట్లు తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు తేల్చారు. అయితే, అప్పటికే అతగాడు స్వదేశానికి చెక్కేయడంతో సంస్థ యాజమాన్యం కువైత్ క్రిమినల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు అతడు సంస్థను మోసగించి తీసుకున్న రూ.14కోట్లు తిరిగి చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.   

Updated Date - 2022-07-21T14:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising