ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

72 గంటల క్వారంటైన్‌పై Kuwait కేబినెట్ కీలక నిర్ణయం.. విదేశీ ప్రయాణికులకు భారీ ఊరట!

ABN, First Publish Date - 2022-01-18T13:54:00+05:30

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటల క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధనను తాజాగా కువైత్ కేబినెట్ రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటల క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధనను తాజాగా కువైత్ కేబినెట్ రద్దు చేసింది. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పీసీఆర్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తే ఎలాంటి క్వారంటైన్ ఉండదు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పీసీఆర్ పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్‌ను ముగించవచ్చని తెలియజేసింది.


ఇదిలాఉంటే.. కువైత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 5,147 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో ఒకరు వైరస్‌కు బలైనట్లు పేర్కొంది. ఇప్పటివరకు కువైత్ వ్యాప్తంగా 4,70,478 మంది కరోనా బారిన పడగా.. 4,24,645 మంది కోలుకున్నట్లు మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డా. అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. మొత్తం కరోనా మరణాలు 2,477కు చేరాయని తెలిపారు. ప్రస్తుతం 33 మంది ఐసీయూలో ఉండగా.. 43,356 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  

Updated Date - 2022-01-18T13:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising