ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సైనికులు ఆయుధాలు చేపట్టరాదు.. కువైత్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-02-19T02:14:26+05:30

యుద్ధ సమయాల్లో మహిళా సైనికులు వివిధ పోరాట బాధ్యతలు చేపట్టేందుకు గత ఏడాది అనుమతించిన కువైత్ ప్రభుత్వం.. తాజాగా తీసుకున్న నిర్ణయం అక్కడి మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  యుద్ధ సమయాల్లో మహిళా సైనికులు వివిధ పోరాట బాధ్యతలు చేపట్టేందుకు గత ఏడాది అనుమతించిన కువైత్ ప్రభుత్వం.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం అక్కడి మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. పోరాట బాధ్యతల్లో పాలుపంచుకోవాలనుకున్న మహిళా సైనికులు ముందుగా తమ తమ సంరక్షకుడి అనుమతి తీసుకోవాలని, ఆయుధాలు చేపట్టకూడదని తాజాగా నిర్ణయించింది.


 గల్ఫ్‌లో అత్యంత ఉదారవాద దేశాల్లో ఒకటైన కువైత్‌లో ఈ నిర్ణయం కలకలానికి దారితీసింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నిర్ణయం ‘ఒకడుగు ముందుకు.. రెండడుగుల వెనక్కు’ అన్న చందంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. సాధారణ పౌరుల మాదిరే మహిళా సైనికులు కూడా తమ శిరస్సులను వస్త్రంతో కప్పుకోవాలని కూడా కువైత్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-02-19T02:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising