ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజల్‌కు గోల్డెన్ వీసా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నటి

ABN, First Publish Date - 2022-02-04T01:48:13+05:30

యూఏఈ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గోల్డెన్ వీసాను నటి కాజల్ ఆగర్వాల్ తాజాగా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గోల్డెన్ వీసాను నటి కాజల్ ఆగర్వాల్ తాజాగా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన లాంటి ఎందరో కళాకారులను యూఏఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తన ట్వీట్‌లో కాజల్ పేర్కొన్నారు. భవిష్యత్తులో యూఏఈతో సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్టు తెలిపారు. గతంలో ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్, సంజయ్ దత్, దుల్కర్ సల్మాన్, టొవీనో థామస్‌, ఫరా ఖాన్, అమలాపాల్, దర్శకనిర్మాత బోనీ కపూర్ కూడా గోల్డెన్ వీసా తీసుకున్నారు.


కాగా.. గోల్డెన్ వీసా కాలపరిమితి 5 లేదా పదేళ్ల పాటు ఉంటుంది. ఆ తరువాత వీసా రెన్యువల్  ఆటోమేటిక్‌గా జరిగే సదుపాయం గోల్డెన్ వీసాకు ఉన్న మరో ప్రత్యేకత. బడా ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, ప్రత్యేక నైపుణ్యాలు కలవారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన పరిశోధకులకు యూఏఈ ఈ వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసాదారులకు యూఏఈలో నివాసార్హతతో పాటు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.



Updated Date - 2022-02-04T01:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising