ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా నల్లజాతీయురాలిని..

ABN, First Publish Date - 2022-01-29T01:39:09+05:30

అగ్రరాజ్య అధినేత జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా నల్లజాతీయురాలిని సుప్రీం కోర్టు జడ్జిగా నామినేట్ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం యూఎస్ సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న స్టీఫెన్ బ్రేయర్.. జూన్‌లో పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలో స్టీఫెన్ బ్రేయర్ స్థానంలో సుప్రీం కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్య అధినేత జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నల్లజాతీయురాలిని సుప్రీం కోర్టు జడ్జిగా నామినేట్ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం యూఎస్ సుప్రీం కోర్టు జడ్జిగా  ఉన్న స్టీఫెన్ బ్రేయర్.. జూన్‌లో పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలో స్టీఫెన్ బ్రేయర్ స్థానంలో సుప్రీం కోర్టు జడ్జిగా నల్లజాతీయురాలిని నామినేట్ చేస్తానని పేర్కొన్నారు. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న బైడెన్.. ‘సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే వారికి అసాధారణమైన విద్యార్హతలు ఉండాలి. న్యాయశాస్త్రంలో మంచి అనుభవంతోపాటు నిజాయితీ ఉండాలి. వీటితోపాటే మంచి క్యారెక్టర్ ఉండాలి. నేను నామినేట్ చేయబోయే మహిళకు ఇవన్నీ ఉండనున్నాయి’ అని పేర్కొన్నారు. అయితే గుణగణాల గురించి చెప్పిన బైడెన్.. తాను నామినేట్ చేయబోయే మహిళ పేరును మాత్రం బయటపెట్టలేదు. 




Updated Date - 2022-01-29T01:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising