ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు..!

ABN, First Publish Date - 2022-01-20T23:42:59+05:30

అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘20 ఏళ్లుగా అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న సైన్యాలను సంపూర్ణంగా వెనక్కు పిలిపించడం అంత సులువైన విషయం కాదు. ఎవరేం చేసినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘20 ఏళ్లుగా అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న సైన్యాలను సంపూర్ణంగా వెనక్కు పిలిపించడం అంత సులువైన విషయం కాదు. ఎవరేం చేసినా, ఎలాంటి వ్యూహాలు పన్నినా అది అసాధ్యం’’ అని బైడెన్ తేల్చి చెప్పారు. 


ఒకే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ దేశాన్ని ఏకీకృతం చేయడం అసంభవమని ఆయన పేర్కొన్నారు. మహా సామ్రాజ్యాలే అఫ్ఘానిస్థాన్‌లో నిలవలేక మట్టిలో కలిసిపోయాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అప్ఘానిస్థాన్ అమెరికాకు ఆర్థికభారంగా మారిందని కూడా చెప్పారు.  తాలిబన్ల అసమర్థత కారణంగా అఫ్ఘానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాల ఉపసంహరణ తరువాత.. అప్ఘాన్‌లో జరుగుతోన్న ఘటనలకు కారణం బైడెన్ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచూ విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-20T23:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising