ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అధ్యక్షుడు Joe Biden మళ్లీ అడ్డంగా దొరికేశారుగా..!

ABN, First Publish Date - 2022-07-09T18:00:52+05:30

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి తడబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి తడబడ్డారు. శుక్రవారం టెలివిజన్‌ ప్రసంగం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. దీంతో మళ్లీ ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా నేతలు ప్రసంగాలకు టెలీప్రామ్టర్లు(Teleprompters) వాడుతుంటారని చాలా మందికి తెలుసు. అలా టెలీప్రామ్టర్‌లో చూస్తూ ప్రసంగించిన బైడెన్‌ అడ్డంగా దొరికిపోయారు. పొరపాటున టెలీప్రామ్టర్‌ సూచనను లైవ్‌లో చదివేశారు. 'రిపీట్‌ ది లైన్‌' (repeat the line) అనే సూచనను ఉన్నదిఉన్నట్టుగా లైవ్‌లో గట్టిగా చదివేశారు‌.


ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక బైడెన్‌ లైవ్‌లో తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు ఇలాగే జరిగింది. ఒకసారి మీడియా సమావేశంలో చేతిలో చిట్టితో దొరికిపోయారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పేరును పలకడంలో కూడా ఆయన తడబడి వార్తల్లో నిలిచారు. అంతేగాక సమాన వేతన దినోత్సవం సందర్భంగా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో(White House) ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలోనూ అధ్యక్షుడు పొరబడ్డారు. ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ను(Kamala Harris) ప్రథమ మహిళ అంటూ సంభోదించారు.



Updated Date - 2022-07-09T18:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising