ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా బలగాల చేతిలో ఐసిస్ చీఫ్‌ హతం

ABN, First Publish Date - 2022-02-04T10:12:41+05:30

తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్‌ “అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి” అమెరికా బలగాల చేతిలో మరణించాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్:   తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్‌ “అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి” అమెరికా బలగాల చేతిలో మరణించాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ పూర్తయ్యాక కమాండోలు తిరిగి సురక్షితంగా తమ స్థావరానికి చేరుకున్నట్టు బైడెన్ పేర్కొన్నారు.


ఈ దాడిలో ఖురేషీతోపాటు సహా అతడి కుటుంబ సభ్యులు మరణించారు. అమెరికా బలగాలు తనను చుట్టుముట్లాయన్న విషయం పసిగట్టిన ఖురేషీ తన కుటుంబంతో సహా ఉన్న ఇంటిని తానే బాంబుతో పేల్చేశాడు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు కూడా చనిపోయారని అధికారులు తెలిపారు.



31 అక్టోబరు 2019లో ఖురేషి ఈ ఉగ్రవాద గ్రూపు బాధ్యతలు చేపట్టాడు. ఖురేషీని అమిర్ ముహమ్మద్ సైద్ అబ్దల్-రహ్మాన్ అల్ మావ్లా అని కూడా పిలుస్తారు. అమెరికా దాడిలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 13 మంది మరణించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. కాగా, ‘మిషన్’ విజయవంతమైనట్టు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ఓ సంక్షిప్త ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-04T10:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising