ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహ వేడుకలో వధువు డ్యాన్స్.. అకస్మాత్తుగా విడాకులిచ్చిన వరుడు.. కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2022-01-11T01:08:08+05:30

వారికి వివాహమై కొన్ని క్షణాలు అయ్యిందంతే.. వివాహ వేడుక ఇంకా పూర్తికాలేదు. అక్కడ వినిపిస్తున్న పాటకు వధువు స్టెప్పులేస్తోంది! ఇంతలో వరుడు ఆమెకు ఊహించని షాకిచ్చాడు. మనిద్దరం కలిసుండటం కుదరదంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వారికి వివాహమై కొన్ని క్షణాలు అయ్యిందంతే.. వివాహ వేడుక ఇంకా పూర్తికాలేదు. అక్కడ వినిపిస్తున్న పాటకు వధువు స్టెప్పులేస్తోంది! ఇంతలో వరుడు ఆమెకు ఊహించని షాకిచ్చాడు. మనిద్దరం కలిసుండటం కుదరదంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు. ఆ తరువాత.. తల్లిదండ్రులతో కలిసి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఇరాక్‌లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. అతడి అనూహ్య నిర్ణయం గురించి తెలిస్తే మనం మరింత షాకైపోతాం. ఆ వేడుకలో వినిపిస్తున్న పాట..అతడికి, తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆ పాట పెడధోరణులను రెచ్చగొట్టే విధంగా ఉందనేది వారి అభిప్రాయం. 


ఆ పాట అర్థం.. అందులోని అంతరార్థం స్పష్టంగానే తెలుస్తున్నా కూడా వధువు తనను తాను మరిచిపోయి చిందేయడం వరుడు భరించలేకపోయాడు. పైచేయి నాదే.. నీవు నీ కంట్రోల్ లోనే ఉండాలి.. ఇలా సాగింది ఆ పాట. దీంతో..చిరెత్తుకొచ్చిన వరుడు ఈ ఆధిపత్యం భరించలేనంటూ అప్పటికప్పుడు భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు, చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. 

Updated Date - 2022-01-11T01:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising