ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాక్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2022-03-10T21:02:49+05:30

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు వందకు పైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ మహిళా నాయకత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను సభకు వివరించారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం అన్నారు. భారత్ నుంచి వచ్చిన మహిళలు, యువతులకు ఎవైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.



అనంతరం టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి మాట్లాడుతూ.. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఒకేచోటు చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం టాక్ ప్రస్థానం లో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి కృషి, ఇతర మహిళా సభ్యుల సహాకారం, ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు రత్నాకర్ ప్రోత్సాహకం వల్లే ఈ వేడుకలు విజయవంతం అయ్యాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంరక్షణ, సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందన్నారు. స్థానిక సంస్థలల్లో మహిళా కోటా తెచ్చి మహిళలను మేయర్లని మున్సిపల్ ఛైర్పర్సన్లను చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహిళా సాధికారతలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. 



అనంతరం టాక్ మహిళా సెల్ ఇన్‌ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనేది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా అభివర్ణించారు.టాక్ సంస్థలో ప్రవాస మహిళలంతా బాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి,మహిళా సెల్ ఇన్‌ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి,  మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని, పవిత్ర, స్వాతి, శ్వేతా మహేందర్, శైలజ జెల్లా, శ్రావ్య, సృజనా, స్నేహ, విద్యా తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-03-10T21:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising