ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo: ముంబై నుంచి బహ్రెయిన్‌కు డైలీ విమాన సర్వీస్

ABN, First Publish Date - 2022-07-09T18:52:44+05:30

బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. బహ్రెయిన్‌ను (Bahrain) తన 25వ అంతర్జాతీయ విమాన గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. బహ్రెయిన్‌ను (Bahrain) తన 25వ అంతర్జాతీయ విమాన గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ముంబై-బహ్రెయిన్ మధ్య డైలీ విమాన సర్వీసులను (Daily flights) నడపనున్నట్లు ప్రకటించింది. ముంబై నుంచి ప్రతిరోజూ రాత్రి 10:15 గంటలకు బయల్దేరే విమానం (6E 1403).. బహ్రెయిన్‌కు రాత్రి 11.35 గంటలకు(బ్రహెయిన్ కాలమానం ప్రకారం) చేరుకుంటుంది. ఇదే విమానం తెల్లవారుజామున ఒంటిగంటకు బహ్రెయిన్ నుంచి ముంబైకి బయల్దేరుతుంది. ఉదయం 7.20 గంటలకు ముంబై (Mumbai) చేరుకుంటుంది. ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కొత్త విమానాలు అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయన్నారు. పెర్ల్ డైవింగ్, ట్రేడింగ్ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఇండియా, బహ్రెయిన్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని బలపరుస్తాయని తెలిపారు. అలాగే ప్రయాణికులకు సరసమైన ఛార్జీలు, సమయానుకూల పనితీరు, విస్తృత నెట్‌వర్క్‌లో మర్యాదపూర్వకమైన, అవాంతరాలు లేని సేవలు అందిస్తామనే మా వాగ్దానానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా సంజయ్ చెప్పుకొచ్చారు.  


Updated Date - 2022-07-09T18:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising