ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో భారతీయులకు ఈ-పాస్‌‌పోర్టులు.. విదేశాంగ శాఖ ప్రకటన

ABN, First Publish Date - 2022-01-06T22:53:41+05:30

కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ- పాస్‌పోర్టులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ- పాస్‌పోర్టుల్లో బయోమెట్రిక్ ఆధారిత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. వీటి ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా మారుతాయని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ- పాస్‌పోర్టులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ- పాస్‌పోర్టుల్లో బయోమెట్రిక్ ఆధారిత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. వీటి ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా మారుతాయని చెప్పారు. ఈ-పాస్‌పోర్టుల్లో ప్రత్యేక మైక్రోచిప్‌లు ఉంటాయి. పాస్‌పోర్టు దారుడికి సంబంధించి బయోమెట్రిక్ డాటా వంటి కీలక వివరాలన్నీ ఈ చిప్‌లో ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కారణంగా ఈ-పాస్ట్‌పోర్టులను ఫోర్జరీ చేయడం లేదా నకళ్లు సృష్టించడం మరింత కష్టతరం కానుంది. 


కేంద్రం ఇప్పటికే 20 వేలకు పైగా ఆధికారిక, దౌత్య పాస్‌పోర్టులను ప్రయోగాత్మకంగా జారీ చేసింది. ఈ ట్రయల్ సత్ఫలితాలను ఇస్తే సామాన్యులకు కూడా వీటిని జారీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కాగా.. ఇప్పటివరకూ జారీ చేసిన ఈ పాస్‌పోర్టులు చిన్న చిన్న బుక్‌లెట్‌ల రూపంలో ఉన్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఈ-పాస్‌పోర్టులను రూపొందించామని కేంద్రం గతంలో తెలిపింది. పాస్‌పోర్టు ముందువైపున అమర్చే చిప్‌లో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఈ-పాస్‌పోర్టు లోగో కూడా నిక్షిప్తమై ఉంటుంది. కాగా.. దేశంలోని  అన్ని  ప్రాంతీయ పాస్ ‌పోర్టుల  కార్యాలయాల ద్వారా ఈ-పాస్‌పోర్టులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. గతంలో ఉన్న మార్గాల ద్వారానే పౌరులు వీటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 



Updated Date - 2022-01-06T22:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising