ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ ధ్రువానికి ఒంటరి ప్రయాణం.. భారత సంతతి మహిళ ప్రపంచ రికార్డ్!

ABN, First Publish Date - 2022-01-05T03:38:51+05:30

బ్రిటన్ ఆర్మీలో కెప్టెన్‌గా సేవలిందిస్తున్న భారత సంతతికి చెందిన హర్‌ప్రీత్ చాందీ తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించారు. దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ట్రెక్కింగ్ నిర్వహించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు.-50 డిగ్రీల చలి, గంటకు 60 మైళ్ళ వేగంతో వీస్తున్న ఈదురు గాలులను లెక్క చేయక ఆమె ఏకంగా 1130 కిలోమీటర్ల దూరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ ఆర్మీలో కెప్టెన్‌గా సేవలిందిస్తున్న భారత సంతతికి చెందిన హర్‌ప్రీత్ చాందీ తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించారు. దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ట్రెక్కింగ్ నిర్వహించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. -50 డిగ్రీల చలి, గంటకు 60 మైళ్ళ వేగంతో వీస్తున్న ఈదురు గాలులను లెక్క చేయక ఆమె ఏకంగా 1130 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం అక్కడికి చేరుకున్నారు. దక్షిణ ధ్రువానికి చేరుకునేందుకు ఆమెకు 40 రోజుల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆర్మీ అధికారులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. 


‘‘ఎట్టకేలకు దక్షిణ ధృవానికి చేరుకున్నా.. ఇక్కడ మంచు కురుస్తోంది. ఇప్పుడు నా మనసులో భావాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మూడేళ్ల క్రితం నాకు ఇక్కడ పరిస్థితులపై కనీస అవగాహన కూడా లేదు. ఇక్కడ చేరుకునేందుకు చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’’ అని ఆమె తన బ్లాగులో రాసుకొచ్చారు. తన ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఆమె ఎప్పటికప్పుడు తన బ్లాగులో రాయడంతో పాటూ..తన ప్రయాణ మార్గానికి సంబంధించి లైవ్ ట్రాకింగ్ మ్యాప్‌ను కూడా ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ తన వివరాలను ప్రపంచానికి తెలియజేశారు. 

Updated Date - 2022-01-05T03:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising