ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Singapore లో 30 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష.. ప్రేయసిపై దాడి చేసి సిమ్ కార్డును కూడా మింగేశాడు..!

ABN, First Publish Date - 2022-06-24T02:09:50+05:30

పరాయి మగాళ్లతో తన గర్లఫ్రెండ్ సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆమెపై బెదిరింపులకు పాల్పడిన ఓ భారత సంతతికి వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పరాయి మగాళ్లతో తన గర్లఫ్రెండ్ సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆమెపై బెదిరింపులకు పాల్పడిన ఓ భారత సంతతికి వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించింది. చంపుతానంటూ ఆమెను బెదిరించడం, గొంతు నొక్కడం, చేయి చేసుకోవడం తదితర నేరాల చేసిన చేసిన పార్తిబన్ మణియన్‌కు ఈ శిక్ష విధించింది. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండుళ్లుగా తన సహోద్యోగితో డేటింగ్‌లో ఉన్న పార్తిబన్ జనవరి 23న ఆమెతో అకస్మాత్తుగా గొడవకు దిగాడు. కత్తెరతో ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడ ఉన్న బాధితురాలి బంధువు పార్తిబన్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. నిందితుడు వినకపోగా ఆమెపై చేయి చేసుకోవడంతో చివరకు మహిళ బంధువు పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. 


ఆ తరువాత.. బెయిల్‌పై విడుదలైన పార్తిబన్ మరోసారి ఆమెపై బెదిరింపులకు దిగాడు. చిన్ను కచ్చితంగా చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆమెను బలవంతంగా ఓ బయటకు తీసుకెళ్లి..అక్కడ మళ్లీ హత్య చేస్తానంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఆమె మొబైల్ చెక్ చేసి..నువ్వు పరాయి పురుషులతో మాట్లాడుతున్నావా అంటూ చిందులు తొక్కాడు. ఆ తరువాత ఆమె మొబైల్‌లోని సిమ్‌ను మింగేసి.. ఫోన్‌ను నేలన వేసి కొట్టాడు. ఆమె మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా నిందితుడు వ్యవహరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితుడికి దాదాపు ఎనిమిది నెలల కారాగార శిక్ష విధించింది. 

Updated Date - 2022-06-24T02:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising