ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో విషాద ఘటన.. భారత యువకుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-04-27T18:46:48+05:30

కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువకుడు చివరకు ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ రాష్ట్రం పాటియాలలోని గగ్గా గ్రామానికి చెందిన అర్షదీప్ వర్మ 2019 మేలో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడి ఒంటారియోలోని కేంబ్రిడ్జ్ కళాశాలలో చదువుతున్నాడు. అక్కడికి వెళ్లిన మరుసటి ఏడాది నుంచే కరోనావైరస్ విజృంభించడంతో అర్షదీప్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు కాలేజీ మూతపడడం అతడిని నిర్వేదంలోకి నెట్టింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో అర్షదీప్ తోటివారితో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదని తెలిసింది. అప్పులు చేసి మరీ రూ. 12లక్షల వరకు ఖర్చు చేయడం.. మధ్యలో ఇలా చదువు ఆగిపోవడం అర్షదీప్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే అర్షదీప్ సూసైడ్ చేసుకున్నట్లు అతని స్నేహితులు చెప్పారు. అర్షదీప్ మృతదేహాన్ని కెనడాలోని స్నేహితులు స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో అతని స్వస్థలం గగ్గాలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.     

Updated Date - 2022-04-27T18:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising