ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న భారత మహిళ.. పట్టించుకోని ఇండియన్ ఎంబసీ.. రక్షించాలంటూ ప్రభుత్వానికి విన్నపం

ABN, First Publish Date - 2022-01-13T22:27:21+05:30

ఇండియాకు చెందిన 5నెలల గర్భిణి ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయింది. భర్తతో సహా ఇండియాకు వచ్చేందుకు.. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇండియాకు చెందిన 5నెలల గర్భిణి ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయింది. భర్తతో సహా ఇండియాకు వచ్చేందుకు.. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో తమను రక్షించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ప్రాంతానికి అంజుమ్ అర్షద్ జమాల్ (58) తన కూతురిని ఆఫ్గనిస్థాన్‌కు చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహం తర్వాత ఆమె జీవతభాగస్వామి వీసాతో భర్తతో కలిసి అఫ్గనిస్థాన్ వెళ్లియింది. అయితే తాలిబన్లు ఆఫ్గానిస్థాన్‌ను తమ చేతుల్లోకి తీసుకోవడంతో.. సదరు మహిళ భర్తతో సహా అక్కడ చిక్కుకుపోయింది. తిరిగి  ఇండియాకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎవాక్యువేషన్ సెల్‌ను పలుమార్లు సంప్రదించింది. ఫలితం లేకపోవడంతో ఇరాన్ ద్వారా భారత్‌కు రావాలని ప్రయత్నించింది. అయితే అది కూడా వీలుపడలేదు. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్ గడువు తేదీ జనవరి 15తో ముగుస్తుందని.. దాన్ని పొడగించాలని ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులను అభ్యర్థించింది. కానీ ఆమె విన్నపాన్ని ఎంబసీ అధికారులు పట్టించుకోకపోవడంతో.. నిరాశతో తిరిగి ఆఫ్గనిస్థాన్‌కు వెళ్లిపోయింది. 



తాజాగా తన తండ్రితో ఫోన్లో మాట్లాడిన ఆమె.. తాను 5నెలల గర్భవతిని అనీ.. తాలిబన్ల పాలన నుంచి తమను రక్షించాలంటూ ఫోన్ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఆఫ్గాన్‌కు వ్యాక్సిన్‌ను తరలించిన విమానాల ద్వారా ఇండియాకు వచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ సందర్భంగా అంజూమ్ అర్షద్ మాట్లాడుతూ.. కూతురి గురించి ఆలోచిస్తూ తన భార్య అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-13T22:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising