ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిష్టాత్మక ఆ‍స్ట్రేలియా అవార్డు రేసులో భారత సంతతి యువతి

ABN, First Publish Date - 2022-03-13T18:56:04+05:30

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి నటాషా ఝా భాస్కర్‌ ప్రతిష్టాత్మక 'యంగ్‌ ఆస్ట్రేలియన్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ 2022' అవార్డు రేసులో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి నటాషా ఝా భాస్కర్‌ ప్రతిష్టాత్మక 'యంగ్‌ ఆస్ట్రేలియన్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ 2022' అవార్డు రేసులో ఉంది. ఈ అవార్డు కోసం తాజాగా ప్రకటించిన 25 మందితో కూడిన తుది జాబితాలో నటాషా కూడా చోటు దక్కింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వివిధ విభాగాల్లో పనిచేసే ప్రతిభావంతులైన మహిళలను ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు. కాగా, సిడ్నీలో నివాసముండే నటాషా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని న్యూలాండ్‌ గ్లోబల్‌ గ్రూప్‌(ఎన్‌జీజీ) జనరల్‌ మేనేజర్‌ హోదాలో పబ్లిక్‌ పాలసీ ఎక్స్‌పర్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇండియన్‌ పార్లమెంట్‌ పాలసీకి సంబంధించి నటాషాకు పన్నెండేళ్ల అనుభవం ఉంది. నటాషా మాట్లాడుతూ.. చాలా మంది ప్రతిభావంతులైన మహిళల జాబితాలో తనకు స్థానం లభించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో యువ ఆస్ట్రేలియన్ల గుర్తింపుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-03-13T18:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising