ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK: బ్రిటన్ వెళ్లాలనుకుంటున్న భారత విద్యార్థులకు సూపర్ న్యూస్!

ABN, First Publish Date - 2022-08-15T02:16:24+05:30

భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులకు తాజాగా ఓ శుభవార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం(UK High Commission) భారతీయ విద్యార్థులకు తాజాగా ఓ శుభవార్త చెప్పింది. త్వరలో ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వీసాలు అందుబాటులోకి తెస్తామని ట్వీట్ చేసింది. అయితే.. రాబోయే వారాల్లో బ్రిటన్ వీసాలకు భారీ డిమాండ్ ఉంటుందని కూడా బ్రిటన్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ రావాలనుకుంటున్న వారు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునేందుకు సమయం పడుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. 


బ్రిటన్ వీసాల జారీలో జాప్యం(Delay) కారణంగా అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోని బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిస్ గత వారం ట్విటర్‌లో ఓ వీడియో సందేశాన్ని షేర్ చేశారు. వీసాల జారీలో జాప్యం జరుగుతోందన్న విషయాన్ని అంగీకరించిన ఆయన.. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తాము చేయవలసినదంతా చేస్తున్నామని హామీ ఇచ్చారు. వీసా జారీ అయ్యాకే విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో పలువురు వీసాలు రాని కారణంగా చివరి నిమిషంలో విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే. 





Updated Date - 2022-08-15T02:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising