ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ నుంచి పెద్ద సంఖ్యలో తిరిగొచ్చిన భారత విద్యార్థులు

ABN, First Publish Date - 2022-02-24T13:28:17+05:30

ఉక్రెయిన్‌ నుంచి పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు తిరిగొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిపించని ఆందోళన

అక్కడ భయానక పరిస్థితుల్లేవు.. అధికారుల సూచన మేరకే వచ్చామని వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉక్రెయిన్‌ నుంచి పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు తిరిగొచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఆ దేశంలో ఉంటున్న మన విద్యార్థులు మంగళవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో విద్యార్థులు సొంతగడ్డపై అడుగుపెట్టడంతో వారి కుటుంబాల్లో గొప్ప ఊరట నెలకొంది. అయితే విద్యార్థుల ముఖాల్లో ఆందోళన తాలూకు ఛాయలేమీ కనిపించకపోవడం విశేషం. ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులేమీ లేవని, అయితే రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారుల సూచనను గౌరవించే తాము స్వదేశానికి తిరిగొచ్చామని అనిల్‌ రాప్రియ అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి ఓ వార్తాసంస్థతో పేర్కొన్నారు. విద్యార్థుల్లో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా పేర్కొంది. 

Updated Date - 2022-02-24T13:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising