ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Ticket draw: డ్రాకు ఒక్కరోజు ముందు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. భారత ప్రవాసుడికి కిలో బంగారం తెచ్చిపెట్టింది!

ABN, First Publish Date - 2022-10-19T13:28:40+05:30

యూఏఈ రాజధాని అబుదాబిలో నివాసం ఉండే భారత ప్రవాసుడికి బిగ్‌టికెట్ డ్రా (Big Ticket draw)లో జాక్‌పాట్ తగిలింది. డ్రాకు ఒక్కరోజు ముందు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ మనోడికి ఏకంగా కిలో బంగారం తెచ్చిపెట్టింది. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయకుమార్ తిరునావుకరుకు ఇలా అదృష్టం వరించింది. ఈ నెల 17న నిర్వహించిన బిగ్ టికెట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలో నివాసం ఉండే భారత ప్రవాసుడికి బిగ్‌టికెట్ డ్రా (Big Ticket draw)లో జాక్‌పాట్ తగిలింది. డ్రాకు ఒక్కరోజు ముందు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ మనోడికి ఏకంగా కిలో బంగారం తెచ్చిపెట్టింది. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయకుమార్ తిరునావుకరసు (Jayakumar Thirunavukarasu)కు ఇలా అదృష్టం వరించింది. ఈ నెల 17న నిర్వహించిన బిగ్ టికెట్ రెండో వారపు ఇ-డ్రాలో విజేతగా నిలిచి జయకుమార్ ఏకంగా ఒక కేజీ బంగారం గెలుకున్నాడు. అక్టోబర్ 17న బిగ్ టికెట్ డ్రా జరిగితే.. కేవలం ఒక్కరోజు ముందు (16వ తారీఖున) జయకుమార్ కొనుగోలు చేసిన టికెట్‌కు ఈ భారీ జాక్‌పాట్ తగలడం విశేషం.


గత మూడేళ్ల నుంచి యూఏఈ రాజధాని అబుదాబిలో నివసిస్తున్న అతడు.. అక్కడికి వెళ్లిన 2019 నుంచే బిగ్ టికెట్ లాటరీలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఇక జయకుమార్ లాగానే అక్టోబర్ నెలలో బిగ్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలోకి ప్రవేశిస్తారని, దీని ద్వారా ప్రతి వారం ఒక విజేత 1కేజీ బంగారు బహుమతిని ఇంటికి తీసుకువెళతారని రాఫెల్ నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు నవంబర్ 3వ తేదీన 25 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్‌కు సంబంధించిన డ్రా ఉంటుందని పేర్కొన్నారు. బిగ్ టికెట్ అభిమానులు ఆన్‌లైన్‌లో ఈ నెల 31 వరకు లాటరీ టికెట్స్ కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. 

Updated Date - 2022-10-19T13:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising