ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ.. 1,130 కిలోమీటర్ల సాహస యాత్ర పూర్తి చేసి..

ABN, First Publish Date - 2022-01-05T21:05:45+05:30

భారత సంతతికి చెందిన హర్‌ప్రీత్ చాంది చరిత్ర సృష్టించారు. అంటార్కిటికా యాత్రను ఒంటరిగా ప్రారంభించిన ఆమె.. కేవలం ఆరు వారాల్లోనే 700మైళ్ల (1,130 కిలోమీటర్ల) దూరం ట్రెక్కింగ్ పూర్తి చేసి, దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నారు. 40 రోజుల్లో తన యాత్ర పూర్తైనట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన హర్‌ప్రీత్ చాంది చరిత్ర సృష్టించారు. అంటార్కిటికా యాత్రను ఒంటరిగా ప్రారంభించిన ఆమె.. కేవలం ఆరు వారాల్లోనే 700మైళ్ల (1,130 కిలోమీటర్ల) దూరం ట్రెక్కింగ్ పూర్తి చేసి, దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నారు. 40 రోజుల్లో తన యాత్ర పూర్తైనట్టు స్వయంగా ఆమే.. తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ ప్రాంతం గురించి ఏమీ తెలియదు. కానీ ఇపుడు నేను ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరీ ధన్యవాదాలు’ అని హర్‌ప్రీత్ చాంది ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. హర్‌ప్రీత్ చాంది బ్రిటన్‌లో ఆర్మీ కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఒంటరిగా సహాస యాత్రను పూర్తిచేయడం పట్ల హర్‌ప్రీత్ చాందిని బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ అభినందించారు. ఇదిలా ఉంటే.. ఈ యాత్ర పూర్తి చేసిన మొదటి శ్వేతజాతియేర మహిళగా హర్‌ప్రీత్ చాంది రికార్డు సృష్టించారు. 




Updated Date - 2022-01-05T21:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising